ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి సంస్థ నిప్పన్ స్టీల్ భారత్‌కు చెందిన టాటా స్టీల్ లిమిటెడ్‌తో కలిసి ఓ జాయింట్ వెంచర్‌గా ఏర్పడనుంది. టాటాతో కలసి సంయుక్తంగా ఆటోమోటివ్ షీట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు నిప్పన్ ప్రకటించింది. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన బ్లూస్కోప్ స్టీల్‌తో కూడా నిప్పన్ ఓ ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు తెలిపింది. ఈ ఒప్పందంతో మార్కెట్‌లో ఇరు కంపెనీల షేర్ల విలువలు స్వల్పంగా పెరిగాయి. నిప్పన్ స్టీల్ 2.4శాతం పెరగగా, బ్లూస్కోప్ స్టీల్ 1.2శాతానికి పెరిగాయి....
టాటా స్టీల్‌తో జాయింట్ వెంచర్‌కు నిప్పన్ సన్నహాలు?